టాలీవుడ్ స్టార్ హీరోయిన్’కు కరోనా
కరోనా బారినపడుతున్న సినీ ప్రముఖుల జాబితా పెరుగుతోంది. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కరోనా బారినపడ్దారు. దీంతో ఆమె ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. తమన్నాలో ఎలాంటి కరోనా లక్షణాల్లేవ్. కానీ టెస్టులో పాజిటివ్ గా వచ్చింది. దీంతో ఆమె ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఇటీవలే కరోనా తల్లిదండ్రులు కరోనా బారినపడి.. కోలుకున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం తమన్నా తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. ఇందులో ఒకటి గోపీ చంద్ సీటీమార్. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి వర్కింగ్ స్టిల్స్ బయటికొచ్చిన సంగతి తెలిసిందే. తమ్మూ నటిస్తున్న మరో తెలుగు చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. ఇందులో సత్యదేవ్ కి జంటగా నటిస్తోంది. రొమాంటిక్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కూడా రొమాంటిక్ గా ఉండనుందట.