ట్రంప్ ఆరోగం విషమం.. 48 గంటలు దాటితే గానీ చెప్పలేం ?

కరోనా బారినపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (74) ఆరోగ్యం విషమించినట్టు సమాచారమ్. ట్రంప్ కు తొలుత వైట్ హైస్ లోనే చికిత్స అందించారు. ఆ తర్వాత వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడే ట్రంప్ కి చికిత్స అందిస్తున్నారు. 48 గంటలు అత్యంత కీలకమని వైద్యులు వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రి వర్గాలు మాత్రం ట్రంప్ ఆరోగ్యం బాగానే ఉంది. జ్వరం, శ్వాస ఇబ్బందులు లేవు.ట్రంప్ కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేం. డిశ్చార్జ్ అయ్యేందుకు కొన్ని రోజుల సమయం పడుతుందని తెలిపాయి. ట్రంప్ వయసు 74 యేళ్లు. ఆయనకి  స్థూలకాయం, కొలెస్టరాల్ ఉండడంతో కలవరపెడుతున్నాయి. ఇక తాను బాగానే ఉన్నానని ట్రంప్ వీడియో మెసేజ్ విడుదల చేశారు. ట్రంప్ కి రెమిడెసివర్ తో పాటు..ప్రయోగాత్మక యాంటీబాడీ ఔషధాలను ఇస్తున్నట్టు తెలుస్తోంది.