మోనాల్ డబుల్ గేమ్.. ఆ ఇద్దరితో రొమాన్స్.. అడ్డంగా బుక్కైందిగా !

తెలుగు బిగ్ బాస్ హౌస్’లో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తున్న సంగతి తెలిసిందే. మోనాల్ గజ్జర్ ఇటు అఖిల్, అటు అభిజిత్ తో రొమాన్స్ చేస్తోంది. అయితే ఎవరికి వారు మోనాల్ నాదే అనే మూడులో ఉన్నారు. వారిని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తోంది. అఖిల్ కి తెలియకుండా అభిజిత్ తో, అభిజిత్ కి తెలియకుండా అఖిల్ తో గుసగుసలు పెడుతోంది. ఎఫైర్ నడిపిస్తోంది. అయితే ఈ డబుల్ గేమ్ శనివారం షో బట్టబయలు అయింది.

ఒక్కో కంటెస్టెంట్ కి పోలీస్ క్యాప్ పెట్టింది.. ఇంటి సభ్యుల్లో ఒకరిని దోషిగా బోనులో నిలబెట్టాలి. అందుకు గల కారణాలు కూడా చెప్పాలని హోస్ట్ నాగ్ ఓ టాస్క్ లాంటిది ఇచ్చారు. ఈ క్రమంలో మోనాల్ అభిజిత్ ని దోషిగా నిలబెట్టింది. కారణం ఏంటీ అంటే.. ? కొన్నాళ్లుగా అభిజిత్ తనతో మాట్లాడటం లేదు. కనీసం ఐ కాంటాక్ట్ కూడా చేయడం లేదని ఆరోపించింది. దీని గురించి ఇంటి సభ్యుల నుంచి నాగ్ వివరణ కోరగా.. మోనాల్ డబుల్ గురించి బయటపడింది. అభిజిత్ కి మోనాల్ ప్రపోజ్ చేసింది. ఆ తర్వాత అఖిల్ తో క్లోజ్ గా ఉంటుంది. దీంతో.. అభిజిత్ అలిగాడు అన్నది వివరణ.

అంతేకాదు.. పొద్దుంతా మోనాల్ అఖిల్ తో క్లోజ్ గా ఉంటుంది. రాత్రి అఖిల్ పడుకున్న తర్వాత అభిజిత్ దగ్గరకు వచ్చి క్లోజ్ గా మూవ్ అవుతుంటుంది ఈ విషయం తెలిసే అభిజిత్ మోనాల్ ని దూరం పెట్టారని ఫుల్లుగా క్లారిటీ ఇచ్చారు ఇంటి సభ్యులు. ఈ ఆరోపణని మోనాల్ ఖండించలేకపోయింది. నిజమే అన్నట్టుగా, పరువు పోయినట్టుగా మొహం పెట్టేసింది. దీంతో మోనాల్ డబుల్ గేమ్ బయటపడింది. ఆమె ఇజ్జత్ పోయినట్టయింది.