పవన్-నితిన్.. అభిమానులు తట్టుకోగలరా ?

హీరో నితిన్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు భక్తుడు అన్న సంగతి తెలిసిందే. అలాంటి నితిన్ పవన్ తో డైరెక్ట్ ఫైట్ కి రెడీ అయినట్టు సమాచారమ్. అలాగని ఇది రియల్ ఫైట్ కాదు. రీల్ ఫైట్. వకీల్ సాబ్ తో పవన్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మే నెలలోనే రిలీజ్ కావాల్సిన వకీల్ సాబ్ కరోనా విజృంభణతో వాయిదాపడింది. మిగిలిపోయిన కొద్దిపాటి షూటింగ్ ని పూర్తి చేసి.. వచ్చే యేడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

అయితే సంక్రాంతి బరిలో నితిన్ కూడా ఉందబోతున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్-కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘రంగ్ దే’. సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర పవన్-నితిన్ ల ఫైట్ తప్పదని అంటున్నారు. అయితే పవన్ సినిమా ఓ మూడ్నాలుగు రోజుల ముందు లేదా వెనక నితిన్ ప్లాన్ చేసుకొనే ఛాన్స్ ఉంది. తద్వారా దేవుడు పవన్  కల్యాణ్ సినిమాకి డ్యామేజ్ కలగకుండా చూసుకొంటారని చెబుతున్నారు.