స్వాతి దీక్షిత్’తో నోయల్.. బాగా కనెక్ట్ అయ్యాడబ్బా.. !!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో రొమాంటి డోస్ తగ్గింది అనే విమర్శలున్నాయ్. కన్పూజన్ తప్ప కెమిస్ట్రీ లేదని చెప్పుకొంటున్నారు. మోనాల్ బాగానే కోపరేట్ చేస్తోంది. కానీ అది ఎవరితో అఖిల్ తోనా ? అభిజిత్ తోనా ?? అనే కన్ఫూజన్ ప్రేక్షకుల్లో నెలకొంది. శనివారం ఏపీసోడ్ తో ఆమెది డబుల్ గేమ్ అని క్లారిటీ వచ్చేసింది. ఇక  హరియాణా ఎఫైర్ పెట్టుకునేందుకు రెడీ, రొమాన్స్ చేసేందుకు డబుల్ రెడీ. కానీ ఆమెతో రొమాన్స్ కి ఎవరు రెడీగా లేరని స్పష్టమవుతోంది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీతో స్వాతి దీక్షిత్ రావడంతో బిగ్ బాస్ ఇంటికి అందాల కళ వచ్చింది. అయితే ఆమెని ఎలిమినేట్ చేస్తూ బిగ్ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇంటి నుంచి స్వాతి దీక్షిత్ వెళ్లిపోతుంటే నోయల్ తట్టుకోలేకపోయాడు. నోయల్ ఎమోషన్స్ ని చూసి.. స్వాతిని ఒకింత షాక్ అయింది. అంతలా ఆమెతో నోయల్ కనెక్ట్ అయినట్టున్నాడు. ఆ విషయాన్ని స్వాతితో కూడా చెప్పనట్టున్నాడు. కానీ ఆమె బయటికి వెళ్లిపోతుంతే.. నోయల్ గుండెల్లోకి బాధ బయటికి తన్నుకొచ్చింది. బహుశా.. దాన్ని బయటికి తీయడానికే స్వాతిని బిగ్ బాస్ ఎలిమినేట్ చేసి ఉంటాడు. ఇది ఫేక్ ఎలిమినేషన్ అని తిరిగి ఇంట్లోకి పంపించి ఉండొచ్చని కూడా చెప్పుకొంటున్నారు. స్వాతి కూడా నోయల్ బాగానే ఓదార్చింది. పోతూ పోతూ హాట్ హాట్ హగ్ లు కూడా ఇచ్చింది.