రష్యా కరోనా వాక్సిన్.. మనదేశంలో మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్ ! 

రష్యా కరోనా వాక్సిన్ స్పుత్నిక్‌ వి’పై మనదేశంలో మూడో దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించటానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్ రెడీ అవుతోంది. దీనికి అనుమతి కోరుతూ డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కు కంపెనీ దరఖాస్తు చేసింది. ‘స్పుత్నిక్‌ వి’ను మనదేశంలో పరీక్షించి, ఆ తర్వాత తయారు చేసి విక్రయించటానికి డాక్టర్‌ రెడ్డీస్‌, రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌ (రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌) తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం సంగతి తెలిసిందే.

అన్ని అనుమతులు వచ్చాక డాక్టర్‌ రెడ్డీస్‌కు 10 కోట్ల డోసుల స్పుత్నిక్‌ వి టీకాను సరఫరా చేయటానికి ఆర్‌డీఐఎఫ్‌ ముందుకు వచ్చింది. మరోవైపు, రష్యాలో ఈ టీకాపై ఇప్పటికే మూడో దశ క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నాయి. అవి విజయవంతమైతే ప్రపంచానికి తొలి కరోనా వాక్సిన్ అందించిన ఘనతని రష్యా సొంతం చేసుకోనుంది. అయితే రెండో దశ క్లినికల్ ట్రయల్స్ లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. కానీ చాలా స్వల్పమని చెబుతున్నారు.