తెలంగాణ సరిహద్దులు మూసివేత.. ఎందుకంటే ?

తెలంగాణ అంతర్రాష్ట్ర సరిహద్దులని మూసివేస్తోంది. సడెన్’గా ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగని ఇది కరోనా కట్టడి కోసం కాదు. మావోయిస్టుల కట్టడి కోసం. అవునూ.. ఇటీవల మావోయిస్టులు భారీగా తెలంగాణకు తరలివచ్చారు. వారి కోసం పోలీస్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. మావోల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ విషయం తెలిసి మావోలు.. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారమ్.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సడెన్ గా అంతర్రాష్ట్ర సరిహద్దులని మూసివేసింది.పోలీసులు, ఒకపక్క రహదారులను దిగ్బంధం చేయడంతో పాటు, మరోవైపు అడవి, అలానే గ్రామాల్లో కూడా పోలీసు బలగాల మోహరించారు. తెలంగాణ ప్రాంతంలోని మహదేవపూర్, ఏటూరు నాగారం అడవి గ్రామాల్లో మావోయిస్టులు పెద్ద ఎత్తున తరలివచ్చారని పోలీసులకి విశ్వసనీయ సమాచారం అందింది వారిని పట్టుకునేందుకు వీలైనన్ని అన్నీ మార్గాలని పోలీసులు వాడుకుంటున్నారు.