యాదాద్రిలో ఆర్జిత సేవలు ప్రారంభం

యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి సన్నిధిలో ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయ్.  కరోనా విజృంభణతో మార్చి 22 నుంచి ఆర్జిత సేవలు రద్దయిన సంగతి తెలిసిందే. 196 రోజుల తర్వాత ఈరోజు పున:ప్రారంభమయ్యాయి. దీంతో స్వామి వారి దర్శనానికి దాదాపు రెండు నుంచి నాలుగు గంటల వరకు సమయం పడుతుంది.

భక్తుల రద్దీ ఉండటంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి కనిపిస్తుంది. కరోనా వైరస్ కారణంగా భక్తులను ఆలయంలోకి అనుమతించే క్రమంలో థర్మల్ స్క్కీనింగ్,శానిటైజర్ ఏర్పాటు చేశారు. సోషల్ డిస్టెన్స్ తో భక్తులు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఇక యాదాద్రి ఆలయ పునర్మాణ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి.