‘బెల్‌ బాటమ్’ టీజర్ చూశారా ?

ప్రేక్షకుల్ని 80ల కాలంలోకి తీసుకెళ్లేందుకు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ రెడీ అవుతున్నారు. ఆయన తాజా చిత్రం ‘బెల్‌ బాటమ్’. తాజాగా ఈ సినిమా టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. ఇందులో అక్షయ్‌ బెల్‌ బాటమ్‌ ప్యాంటు ధరించి.. విమానాశ్రయంలో స్టైలిష్‌గా నడుస్తూ అభిమానుల్ని ఆకట్టుకున్నారు. సింగిల్  డైలాగ్స్‌ లేకుండా టీజర్ ని కట్ చేశారు.

’80ల కాలం నేపథ్యంలో సాగే థ్రిల్లింగ్‌ కథ’ అంటూ అక్షయ్‌ ట్వీట్‌ చేశారు. ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు స్కాట్‌ల్యాండ్‌లో జరిగింది. వాణీ కపూర్‌ కథానాయిక. హుమా ఖురేషీ, లారా దత్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఇమ్మీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రంజిత్‌ ఎమ్‌. తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.