బిగ్ బాస్ : మోనాల్ అనుకున్నంత పని చేసింది !

ఒకే అమ్మాయి ఇద్దరితో. అది కూడా ఒకే టైమ్ లో. అందులోనూ అది లైవ్. అయినా మోనాల్ గజ్జర్ బాగానే మెయిన్ టైన్ చేసింది. బిగ్ బాస్ హౌస్’లో మోనాల్ ఇటు అఖిల్, అటు అభిజిత్ తోనూ సన్నితంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఒకరికి తెలియకుండా మరొకరితో రొమాన్స్ చేస్తోంది. ఆ డబుల్ గేమ్ సంగతి శనివారం షో బయటపడిన సంగతి తెలిసిందే. దాని ఎఫెక్ట్ ఏమో గానీ.. మోనాల్ కోసం అభిజిత్, అఖిల్ పోట్లాటకి దిగారు. దానికి సంబంధించిన ప్రోమోని స్టార్ మా కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది.

ఇందులో అఖిల్-అభిజిత్ ఒకరిపై మరొకరు ఓ రేంజ్ లో వేసుకున్నారు. మోనాల్ పై అఖిల్ మాట కూడా పడనీయలేదు. మోనాల్ తెరవు రాకు అని అఖిల్ హెచ్చరించగా.. ఆ అమ్మాయితో నీకేం పని అంటూ అభిజిత్ గట్టిగానే ప్రశ్నించాడు. అయితే వీరి పోట్లాట మాటలకే పరిమితం అయిందా ? లేక.. చేతల వరకు వెళ్లిందా అన్నది నేటి ఏపీసోడ్ లో చూడొచ్చు.