కరోనా ఎఫెక్ట్.. బ్యాలెట్ పద్దతిలోనే గ్రేటర్ ఎన్నికలు !

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలోనే జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో.. గ్రేటర్ ఎన్నికలని బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికల నిర్వహణ జరుగుతుంది అని ఎన్నికల సంఘం ప్రకటించింది. అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 26 రాజకీయ పార్టీలు కూడా బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించాలని కోరినట్టు తెలిసింది.

ఇక గ్రేటర్ ఎన్నికలకి ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదు. నవంబర్ రెండో వారం తర్వాత ఎప్పుడైనా గ్రేటర్ ఎన్నికలకి నోటిఫికేషన్ రావొచ్చని చెప్పుకొంటున్నారు. అయితే ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ఇంకా గ్రేటర్ ఓవర్ లిస్టు రెడీ కాలేదు. ప్రస్తుతం దానిపై కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే యేడాది జనవరి ఆఖరి వారంలో గ్రేటర్ ఎన్నికలకి నోటిఫికేషన్ రావొచ్చని తెలుస్తోంది. అయితే ఇప్ప్పటి నుంచే గ్రేటర్ ఎన్నికలపై ప్రధాని పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి.