హేమంత్ కేసు.. మరిన్ని షాకింగ్ విషయాలని వెల్లడించిన పోలీసులు !
హేమంత్ పరువు హత్య కేసులో మరిన్ని కీలక విషయాలని పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన నిందితుల కస్టడీ ఈరోజుతో ముగిసింది. ఈ నేపథ్యంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు ఈ కేసుకు సంబందించిన విషయాలు మీడియాలో వెల్లడించారు.
హేమంత్ మర్డర్ కేస్ లో పరారీలో ఉన్న ఎరుకాల కృష్ణ,మహమ్మద్ పాషా ( లడ్డు),రాజు ,సాయన్న ను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు. హేమంత్ ను చంపిన తరవాత మృతదేహం పై ఉన్న బంగారు ఆభరణాలను ఎరుకాల కృష్ణ తీలుకొని వెళ్ళాడని, ఎరుకాల కృష్ణ వద్ద ఉన్న బంగారు ఆభరణాలు సీజ్ చేయటం జరిగిందని అన్నారు.
ఇక విచారణలో పరువు పోయిందనే హేమంత్ ని హత్య చేయించానని అవంతి తండ్రి లక్ష్మారెడ్డి తెలిపారు. హేమంత్ ని చంపడానికి రూ. 10లక్షలు కాదు.. రూ. 30లక్షలు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యా. కానీ రూ. 10 లక్షల్లోనే పనైపోయిందని చెప్పినట్టు తెలిసింది. హేమంత్ ని హత్య చేసిన ప్రశ్ఛాతాపం లక్ష్మారెడ్డిలో కించ్చిత్తు కూడా కనిపించడం లేదని తెలుస్తోంది. ఇక ఈ కేసులో అవంతి సోదరుడు ఆశిష్ రెడ్డి పాత్ర ఉందని ఇప్పటి వరకు తేలలేదని పోలీసులు చెబుతున్నారు.