చైనా, పాక్‌లతో ఒకేసారి యుద్ధం !
తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఘర్షణలతో భారత్, చైనా మధ్య గత ఐదు నెలలుగా ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ అంశంపై ఇరు దేశాల మధ్య పలుమార్లు దౌత్యపరమైన, సైనికపరమైన చర్చలు జరిగినప్పటికీ సమస్య పరిష్కారానికి ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలో అక్టోబరు 12న రెండు దేశాల సైనికాధికారులు మరోసారి సమావేశం కానున్నారు. అయితే చైనాతో యుద్ధం చేయాల్సి వస్తే.. పాక్ తోనూ యుద్ధం చేయాల్సి వస్తుంది. తాజాగా దీనిపై వాయుసేన దళాధిపతి ఆర్‌కేఎస్ బదౌరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సరిహద్దుల్లో ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు భారత వాయుసేన(ఐఏఎఫ్) సంసిద్ధంగా ఉందని.. అవసరమైతే ఏకకాలంలో చైనా, పాకిస్థాన్‌లతో యుద్ధం చేయగలమని వాయుసేన దళాధిపతి ఆర్‌కేఎస్ బదౌరియా స్పష్టం చేశారు. వాయుసేన సామర్థ్యంలో చైనా మనకంటే గొప్పేం కాదని బౌదరియా అన్నారు. సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామన్నారు.