పవన్’ని కలిసిన కిచ్చ సుధీప్

కన్నడ హీరో కిచ్చ సుధీప్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని కలిశారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలని సుధీప్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది సర్’ అంటూ సుధీప్ రాసుకొచ్చారు. ఇంతకీ సుధీప్ పవన్ ని ఎందుకు కలిసినట్టు ? అని ఆరా తీసే పనిలో పవన్ అభిమానులు ఉన్నారు.

వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ తర్వాత పవన్ వరుస సినిమాలని లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. వరుసగా నాలుగు సినిమాలని లైన్లో పెట్టారు పవన్. వీటిలో ఏదైనా సినిమాలో సుధీప్ నటించనున్నారా.. ? దాని గురించి మాట్లాడేందుకే పవన్-సుధీప్ కలిశారా ? అన్న చర్చ మొదలైంది. ‘ఈగ’ సినిమాతో సుధీప్ తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు. ఇందులో విలన్ పాత్రలో అదరగొట్టిన సంగతి తెలిసిందే.