తేజు పెళ్లి ఫిక్స్.. నిజమా ?
మెగా ఇంట్లో మరో పెళ్లి ఫిక్సయినట్టు సమాచారమ్. మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజు పెళ్లి ఫిక్సయినట్టు తెలుస్తోంది. ఇటీవల తేజు అమ్మగారు ఓ సంబంధం చూశారట. అంతా ఓకే అనుకున్నాక అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి చెప్పారట. ఆయన్నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ యేడాది నవంబర్ లోనే పెళ్లి చేయాలని అనుకున్నా.. సరైన ముహుర్తాలు లేని కారణంగా వచ్చే యేడాది సమ్మర్ లో పెళ్లి వేడుక అనుకుంటున్నారట. తేజు పెళ్లాడబోయే అమ్మాయి ఎవరు ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటీ అన్నది తెలియాల్సి ఉంది.
ఇక తేజు పెళ్లి కంటే ముందే మెగా హీరోయిన్ నిహారిక పెళ్లి వేడుక జరగనుంది. జొన్నలగడ్డ చైతన్యని నిహారిక పెళ్లాడబోతుంది. ఇప్పటికే వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ యేడాదిలోనే పెళ్లి జరగనుంది. అది వచ్చే నెలలోనే అంటున్నారు. అయితే దీనిపై మెగా ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి తేజు ఆయన మరదలు నిహారిక బ్యాక్ టు బ్యాక్ పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రస్తుతం తేజు ‘సోలో బతుకే సో బెటర్’ సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత దేవాకట్టా దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నారు.