సంజయ్ దత్.. ఎంతలా బక్కచిక్కారో చూశారా.. ?
బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ క్యాన్సర్ బారినపడిన సంగతి తెలిసిందే. ఆయన నాల్గో దశ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అయితే తాజాగా హాస్పటల్ లో సంజయ్ నడుచుకుంటూ వస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో సంజూ బాగా బక్కచిక్కిపోయి కనిపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆయన బాగా క్షీణించారు. ఈ పిక్ ను చూసి ఆయన అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంతలా చిక్కిపోయారేంటీ ? అని ఆందోళన చెందుతున్నారు.
ఇక ఇటీవల సంజయ్ ముంబైలో తొలి దశ కీమోథెరపీని పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత భార్య మాన్యతో కలిసి దుబాయ్‌లో ఉంటున్న పిల్లల దగ్గరకి వెళ్లారు. అక్కడ కొన్నిరోజులు గడిపారు. ఇటీవల ముంబైకి తిరిగి వచ్చారు. త్వరలోనే ఆయనకి ముంబై రెండో దశ కీమోథెరపీ ప్రారంభం కానుంది. ఆగస్టు 11న సంజూకి క్యాన్సర్ అన్న సంగతి తెలిసింది. దీంతో తన ఆరోగ్యం బాగా లేదని చికిత్స నిమిత్తం కొంత కాలం విరామం తీసుకుంటున్నట్టు సంజూ ట్విట్ చేసిన సంగతి తెలిసిందే.