గుడ్ న్యూస్.. హాస్పటల్ నుంచి తమన్నా డిశ్చార్జ్ !

మిల్కీ బ్యూటీ తమన్నా కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందారు. తాజాగా వారికి తమ్మూ గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా నుంచి కోలుకున్నా.. హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యానని తెలిపారు. ఈ మేరకు ఓ చిన్నిపాటి నోటుని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

‘సెట్‌లో తమ బృందం జాగ్రత్తలు పాటిస్తూ, నిబద్ధతతోనే ఉన్నాం. అయినప్పటికీ గత వారం తనకు స్వల్పంగా జ్వరం వచ్చింది. దీంతో పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది.  హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి, వైద్యుల సలహాతో చికిత్స తీసుకున్నా. ఇప్పుడు తనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు’ అని తమన్నా  పేర్కొన్నారు.
ప్రస్తుతం తమన్నా సీటీమార్, గుర్తుందా శీతాకాలం సినిమాల్లో నటిస్తోంది. ఆమె నటించిన ‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి’ విడుదలకు సిద్ధమౌతోంది. ‘బోలె చుడియన్‌’ అనే హిందీ ప్రాజెక్టుకు కూడా సంతకం చేశారు.