జగన్ కోసం పవన్’ని పక్కన పెడతారా ?

అవసరం – ఈ ఒక్క మాటతోనే రాజకీయాలు నడుస్తుంటాయ్. ఇప్పుడు భాజాపాకు వైసీపీ అవసరం పడింది. దీంతో ఆ పార్టీని ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నారు. ఇందుకు ఫలితంగా వైసీపీకి మూడు కేంద్ర మంత్రి పదవులు దక్కబోతున్నట్టు సమాచారమ్. ఈరోజు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్.. రేపు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశంలో కానున్నారు. ఈ సమావేశంతో ఎన్ డీయేలో వైసీపీ చేరడంపై క్లారిటీ రానుందని తెలుస్తోంది. ఇటీవల ఎన్డీయే నుంచి రెండు పార్టీలు బయటికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడా ఖాళీని వైసీపీతో భర్తీ చేయనుంది భాజాపా.

అయితే జగన్ ని దగ్గరకు చేసుకోవడంతో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని దూరం పెడతారా ? అన్న చర్చ మొదలైంది. ఏపీలో జగన్ పై పోరాడేందు భాజాపా జనసేనతో జతకట్టిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు భాజాపా-జనసేన కలిసి పనిచేస్తాయని ప్రకటించాయి. అయితే ఇప్పుడు మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఏపీలో భాజాపాకు జనసేన అవసరం లేకపోవచ్చు. అప్పుడు భాజాపా-వైసీపీ దోస్తానా పార్టీలు కావొచ్చు. ఈ లెక్కన భాజాపా జగన్ కోసం పవన్ ని పక్కనపెట్టినట్టే అవుతుంది మరీ.. !