మన్కడింగ్.. అశ్విన్ లాస్ట్ వార్నింగ్ !
దుబాయ్ వేదికగా నిన్న బెంగళూరుతో తలపడిన మ్యాచ్‌లో ఢిల్లీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ చేసే అవకాశం ఉన్నా బెంగళూరు బ్యాట్స్‌మన్ ఆరోన్ ఫించ్‌ను వదిలేసిన సంగతి తెలిసిందే. అక్కడి అశ్విన్ ఈ విషయాన్ని వదిలేయలేదు. మ్యాచ్ అనంతరం అశ్విన్ ఓ ట్వీట్ చేసి అందరికీ గట్టి హెచ్చరిక జారీ చేశాడు. 2020లో ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అని పేర్కొన్నాడు. మళ్లీ ఎవరైనా అలా క్రీజు వదిలి ముందుకు వెళితే తాను కచ్చితంగా ఔట్ చేస్తానని అధికారికంగా వెల్లడించాడు.
గతేడాది లీగ్‌లో రాజస్థాన్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్‌ను అతడు ఇదే విధంగా ఔట్ చేయగా పెద్ద దుమారం రేగింది. అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పలువురు క్రికెటర్లు అతడిపై తీవ్ర విమర్శలు చేశారు. అయినా అశ్విన్ అవేమీ పట్టించుకోకుండా ఆట నియమాలకు లోబడే ప్రవర్తించానని అంతే దీటుగా సమాధానమిచ్చాడు. అయితే టీ20 ఆరంభానికి ముందు అశ్విన్ మస్కడింగ్ చేయకుండా చూస్తామని ఢిల్లీ కోచ్ పాటింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజా సీన్ తో అశ్విన్ ఎవరి మాట వినడం లేదని అర్థమవుతోంది.
#RCBvDC
Don't know how much hearts won Today
But Ashwin will definitely wins thousands of heart's 😍#ashwin #DelhiCapitals #YehHaiNayiDilli #RoarMacha @DelhiCapitals @ashwinravi99 @RCBTweets #RCB #PlayBold pic.twitter.com/hTsezrnHk9— ರಿತಿಕ್ ಗೌಡ | RITHIK GOWDA (@imrithik83) October 5, 2020