స్కూల్స్ రీ ఓపెన్.. కేంద్రం మార్గదర్శికాలు విడుదల !

అన్ లాక్ 5లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విద్యా సంస్థలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 15 నుంచి విద్యా సంస్థలకి అనుమతులు ఇచ్చింది. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలిపింది. అయినా… స్కూల్స్ రీ ఓపెన్ పై కేంద్రం కూడా గైడ్ లైన్స్ ని విడుదల చేసింది.

స్కూల్ రీ ఓపెన్ – కేంద్ర గైడ్ లైన్స్ :

*  ఆరోగ్యం, భద్రత అంశాలకు సంబంధించి మొదటిభాగం, ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ టీచింగ్ కోనసాగించే అంశాలపై రెండో భాగంలో విద్యాశాఖ మార్గదర్శకాలిచ్చింది.

*  స్థానిక పరిస్థితులను పరిశీలించి ఒకటొ భాగంలోని మార్గదర్శకాలను అమలు చేయాలని కోరింది.

* టీచింగ్ కు సంబంధించి ఇచ్చిన మార్గదర్శకాలు కేవలం సూచన మాత్రమే.

*  పరిస్థితులకు అనుగుణంగా వాటిని అనుసరించవచ్చని లేదా రాష్ట్ర ప్రభుత్వాలే తమ నిబంధనలు రూపొందించుకోవచ్చని తెలిపింది.

* పేరెంట్స్ అనుమతితో స్టూడెంట్స్ ఇంటి నుంచే చదువుకుంటామంటే అందుకు అనుమతించాలని సూచించింది.

* స్కూళ్లు ప్రారంభమైన తర్వాత రెండు మూడు వారాల వరకు ఎలాంటి అసెస్‌మెంట్‌ చేయకూడదని, ఆన్‌లైన్‌ లెర్నింగ్, ఐసీటీ విధానాలను ప్రోత్సహించే విధానాలను కొనసాగించాలని సూచించింది.