అఫిషియల్ : కాజల్ పెళ్లి ప్రకటన.. ఈ నెల 30నే పెళ్లి !

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లిపై జరిగిన ప్రచారం నిజమైంది. ఆమెని ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుని పెళ్లాదబోతుంది. ఈ నెల 30నే పెళ్లి. ఈ మేరకు కాజల్ ట్విట్ చేసింది. తన ట్విట్టర్ ఖాతాలో ఓ చిన్నిపాటి నోటు ని షేర్ చేసింది.

‘ముంబై వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుని అక్టోబర్‌ 30న పెళ్లాడబోతున్నా. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానిస్తున్నట్టు చెప్పింది. తన సినీ ప్రయాణంలో మద్దతుగా నిలిచి ఆదరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని రాసుకొచ్చింది.

లక్ష్మీ కల్యాణం సినిమాతో కాజల్ తెలుగు తెరకుపరిచయం అయింది. చందమా సినిమాతో తొలి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కాజల్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. మగధీర, డార్లింగ్, మిస్టర్ ఫర్ ఫెక్ట్.. ఇలా బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. టాలీవుడ్ లోని స్టార్  హీరోలందరితోనూ ఆడిపాడింది. కోలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆచార్య, భారతీయుడు 2 సినిమాల్లో కాజల్  నటిస్తోంది.