#RRR టీజర్ వచ్చేసింది !

#RRR అప్ డేటు వచ్చేసింది. ఊహించినట్టుగానే షూటింగ్ అప్ డేటు ఇచ్చారు. కాకపోతే.. సింపుల్ గా ట్విట్ చేయకుండా.. ఓ టీజర్ లాంటిది రిలీజ్ చేశారు. ఈ సినిమా షూటింగ్ అందరిలానే కరోనా వలన ఆపెశామని ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో షూట్ స్టార్ట్ చేస్తున్నామని ప్రకటించారు.

షూటింగ్ తిరిగి మొదలెడుతున్న నేపథ్యంలో సెట్ కి లాక్ తీయడంతో పాటు సెట్స్ అన్నీ క్లీన్ చేస్తున్న బిట్ సీన్స్ చూపించారు. ఇందులో కరోనా పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలు చూడొచ్చు. 24 క్రాఫ్ట్ లని ఈ చిన్ని వీడియోలో కవర్ చేశారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రామ్ చరణ్ లుక్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దసరా కానుకగా ఎన్ టీఆర్ లుక్ ని రిలీజ్ చేయబోతున్నారు.

స్వాత్రంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ ల జీవితకథలోని ఓ ఉమ్మడి పాయింట్ ఆధారంగా ఆర్ ఆర్ ఆర్ కథని రెడీ చేశారు రాజమౌళి. ఇందులో అల్లూరిగా రామ్ చరణ్, ఆయనకి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. కొమరం భీమ్ పాత్రలో తారక్, ఆయనకి  జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా మోరీస్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 400కోట్ల బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.