లుక్ మార్చిన దినేష్.. లక్ కలిసి వస్తుందా ?


ఐపీఎల్13లో కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తీక్ పై తీవ్ర విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. కెప్టెన్ గా, బ్యాట్స్ మెన్ గా విఫలవుతున్నాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ బాధ్యతల నుంచి దినేష్ కార్తీక్ ని తప్పించాలనే డిమాండ్ వస్తోంది. దినేష్ స్థానంలో మోర్గాన్ ని కెప్టెన్ చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో డీకె లుక్ మార్చారు. గడ్డం లుక్ ని తీసే.. స్మార్ట్ లుక్ లోకి మారాడు. మరీ.. ఇప్పుడైనా.. ఆయనకి లక్ కలిసొస్తుందేమో చూడాలి. ‘బ్రేక్‌ ది బియర్డ్‌ చాలెంజ్‌’లో భాగంగా దినేష్ లుక్ మార్చేసాడు.
 
మొదట పాండ్యా తన బియర్డ్‌ను తొలగించి విండీస్‌ విధ్వంసం కీరన్‌ పొలార్డ్‌కు చాలెంజ్‌ విసిరాడు. కాగా పొలార్డ్‌ పాండ్యా చాలెంజ్‌ను స్వీకరించి రాజస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు ఫ్రెంచ్‌ కట్‌లో ఉన్న వీడియో రిలీజ్‌ చేశాడు. ఆ వీడియోలో పొలార్డ్‌ గడ్డంతో కాకుండా ఫ్రెంచ్‌కట్‌తో న్యూలుక్‌లో దర్శనమిచ్చాడు. తర్వాత ఈ చాలెంజ్‌ను కేకేఆర్‌ కెప్టెన్‌ దినేష్‌ కార్తీక్‌ను నామినేట్‌ చేశాడు. ఈ ఛాలెంజ్ ని స్వీకరించిన దినేష్ కొత్త లుక్ లోకి మారిపోయాడు. 

నేటి మ్యాచ్ లో కోల్ కత్తా చెన్నైతో తలపడుతోంది. టాస్ గెలిచిన కోల్ కతా బ్యాటింగ్ ఎంచుకుంది. 12 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో త్రిపాఠి (56), మోర్గాన్ (5) ఉన్నారు.