హాథ్రస్‌ ఘటనలో షాకింగ్ ట్విస్ట్ 

హాథ్రస్‌ కేసులో కీలక షాకింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. బాధితురాలి సోదరుడు నిందితుల్లో ఒకరితో అనేక సార్లు ఫోన్‌లో మాట్లాడినట్టు ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు గుర్తించారు. మృతురాలి సోదరుడు, నిందితుల్లో ఒకరైన సందీప్‌ ఠాకూర్‌ అనే వ్యక్తితో గతేడాది అక్టోబర్‌ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో సుమారు 104 సార్లు ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిపారు.

దీనిపై బాధితురాలి సోదరుడిని పోలీసులు ప్రశ్నించారు. అయితే ఈ ఫోన్‌ సంభాషణల గురించి తనకేమీ తెలీదని.. తాను గానీ, తన కుటుంబంలో ఇంకెవరూ గానీ ఎవరితోనూ మాట్లాడలేదని చెప్పారు. సెప్టెంబర్‌ 14న యూపీలోని హాథ్రస్‌ గ్రామంలో దఌత మహిళని దుండగులు దారుణంగా రేప్ చేసిన సంగతి తెలిసిందే. సదరు మహిళ మృతదేహాన్ని పోలీసులు అర్థరాత్రి దహనం చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.