పెళ్లి గురించి కాజల్ ముందే హింట్ ఇచ్చింది.. కానీ ఎవరు గుర్తుపట్టలేకపోయారు !
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. తన స్నేహితుడు గౌతమ్ కిచ్లును అక్టోబర్ 30న వివాహం చేసుకోబోతున్నట్లు మంగళవారం ఆమె అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాజల్ బ్యాచిలరేట్ పార్టీకి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను కాజల్ సెప్టెంబర్ 28న ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నప్పటికీ.. అవి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ పిక్స్ అని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు.
ఈ పార్టీలో ఆమె కుటుంబసభ్యులు, గౌతమ్ కిచ్లు సోదరితోపాటు అతి తక్కువమంది స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. ఈ వేడుకల్లో కాజల్ బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి.. ‘బ్రైడ్ టు బి’ క్యాప్షన్‌తో నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు. అవి నెట్టింట్లో వైరల్ అయ్యాయ్. అప్పుడు ఇవి కాజల్ బ్యాచిలర్ పార్టీ ఫోటోలని ఎవరి తెలియదు. ఇప్పుడీ ఈ విషయం తెలిసి.. ఆ ఫోటోలని షేర్ చేస్తున్నారు. కాజల్ ని విష్ చేస్తున్నారు.
ప్రస్తుతం కాజల్ మూడ్నాలుగు సినిమాతో బిజీగా ఉన్నారు. మంచు విష్ణుతో కలిసి ఆమె నటిస్తోన్న ‘మోసగాళ్లు’ టీజర్ ఇటీవల విడుదలయ్యింది. శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్‌లో రానున్న ‘భారతీయుడు-2’ చిత్రంలో ఆమె కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే ‘ఆచార్య’ సినిమాలో చిరంజీవితో కలసి ఆడిపాడనున్నారు.