టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ ల సందడి

కరోనా లాక్‌డౌన్’తో సినిమా షూటింగ్’లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. మార్చి నుంచి నో యాక్షన్. దాదాపు ఆర్నెళ్లపాటు సినీతారలంతా ఇంటికే పరిమితం అయ్యారు. రెండ్నెళ్ల ముందే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్ లకు అనుమతులు ఇచ్చినా.. సినిమాలు సెట్స్ మీదకి వెళ్లలేదు. ఒకట్రెండు చిన్ని సినిమాలు మాత్రమే షూటింగ్స్ జరుపుకున్నాయి. అయితే ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ వరుసగా సెట్స్ మీదకు వెళ్తున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందాలు సంతోషంగా పంచుకుంటున్నాయి.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. నిన్న ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ఓ మేకింగ్ వీడియోని రిలీజ్ చేసింది. తాజాగా మరిన్ని సినిమాల షూటింగ్ అప్ డేట్స్ వచ్చేశాయి. ఈరోజు క్రాక్ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. మాస్ మహారాజ రవితేజ ట్విట్ చేశారు.

ఇక నితిన్-కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ‘రంగ్ దే’ షూటింగ్ ఈరోజు మొదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం కొన్ని ఫోటోలు చేసింది. మొత్తానికి.. టాలీవుడ్ లో మళ్లీ సినిమాల సందడి మొదలైంది. ఇప్పుడు షూటింగ్స్ ప్రారంభిస్తేనే వచ్చే యేడాది సంక్రాంతి బరిలో దిగొచ్చని సినిమా వాళ్లు భావిస్తున్నారు.