వైరల్ : రియా జైలు నుంచి విడుదలైన ఫోటోలు

డ్రగ్స్ కేసులో అరెస్టైన రియా చక్రవర్తికి బాంబే హైకోర్టు బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు నెలరోజుల పాటు బైకుల్లా జైలులో ఉన్న రియాను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. జైలు నుంచి ఆమె కారులో ఇంటికి బయలుదేరారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రియా సెప్టెంబర్ 28న అరెస్టైన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు బెయిల్‌ లభించడంతో 28 రోజుల తర్వాత ముంబైలోని బైకుల్లా జైలు నుంచి రియా బయటకు వచ్చారు. ఇక ఇదే కేసులో అరెస్టయిన రియా సోదరుడు షోవిక్ చక్రవర్తికి మాత్రం బెయిల్ మంజూరు కాలేదు. రియాకు మాత్రమే ముంబై కోర్టు శరతులతో కూడిన బెయిల్ ని మంజూరు చేసింది. ఈ సందర్భంగా 9 కండిషన్స్ పెట్టింది.  * పాస్‌పోర్టు డిపాజిట్‌ చేయాలి

* పది రోజులకొకసారి సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లో రిపోర్టు చేయాలి.

* పూచీకత్తు కింద రూ.1లక్ష చెల్లించాలి

* దేశాన్ని విడిచి వెళ్లరాదు

* ఈ కేసులో సాక్షులను కలవకూడదు.

* గ్రేటర్‌ ముంబయిని దాటి వెళ్లాల్సి వస్తే మాత్రం దర్యాప్తు అధికారికి సమాచారం ఇవ్వాలి. ప్రయాణానికి సంబంధించిన వివరాలను ముందుగానే అందజేయాలి.

* ప్రతి నెలలో తొలి సోమవారం దర్యాప్తు సంస్థ ఎదుట రిపోర్టు చేయాలి. ఇలా ఆరు మాసాలపాటు చేయాల్సి ఉంటుంది.

* ఏదైనా సహేతుకమైన కారణం ఉంటే తప్ప అన్ని తేదీల్లోనూ కోర్టుకు హాజరు కావాలి.

* ఈ కేసులో దర్యాప్తు, సాక్ష్యాలను దెబ్బతీసేలా వ్యవహరించకూడదు.