ధోని స్థానంలో పంత్ నే.. మరో ఆప్షన్ లేదు !

టీమిండియా వికెట్‌కీపర్‌గా మహేంద్ర సింగ్ ధోని స్థానంలో ఎవరు ? ఈ ప్రశ్నకి తాజా ఐపీఎల్ సీజన్ తో సమాధానం దొరుకుతుందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. రిషబ్ పంత్ ఎన్ని అవకాశాలిచ్చిన.. వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ధోని వారసుడిగా సంజూ శాంసన్ ని భావించాలని అంటున్నారు. సంజూ కాదనుకుంటే.. బ్యాట్స్ మెన్ గా రాణిస్తున్న కె ఎల్ రాహుల్ కే వికెట్ కీపర్ బాధ్యతలని అప్పగించాలని సూచిస్తున్నారు.

అయితే ఎవరిన్ని రకాలుగా చెప్పుకున్నా.. ధోని వారసుడు పంత్ నే అంటున్నారు మాజీ మాజీ క్రికెటర్లు నెహ్రా, సంజయ్ బంగర్. ఎందుకంటే ? కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ ఎక్కువ ఉన్న భారత జట్టులో పంత్ ఉండటం వల్ల మిడిలార్డర్‌ బలంగా మారుతుందని చెబుతున్నారు.  ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న లీగ్‌లో పంత్ రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 42.57 సగటుతో 171 పరుగులు చేశాడు. ఈ సీజన్ పూర్తయ్యేలోపు ధోని వారసుడు ఎవరు అనేది క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు.