బిగ్ బాస్ హోస్ట్’గా సమంత ?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 సూపర్ హిట్ అవుతోంది. తొలివారానికి రికార్డ్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చినట్టు బిగ్ బాస్ యాజమాన్యం ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఐపీఎల్ ఎఫెక్ట్ తో రేటింగ్స్ తగ్గినట్టు తెలుస్తోంది. అయినా.. హోస్ట్  నాగార్జున తనదైన శైలిలో బిగ్ బాస్ షోని రక్తికట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సోమ-శుక్ర వరకు షో ఎలా సాగినా..  శని, ఆదివారాలు మాత్రం సరదాగా సాగుతున్నాయ్. ఇలాంటి టైమ్ లో బిగ్ బాస్ కి నాగ్ సడెన్ షాక్ ఇవ్వబోతున్నట్టు.. షోకి దూరం కానున్నట్టు ప్రచారమ్ జరుగుతోంది.
 
నాగ్ తన తాజా చిత్రం వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కోసం ఫారిన్ ట్రిప్ వెళ్లనున్నారట. దాదాపు 20 రోజుల షెడ్యూల్ అది. దీంతో మూడు వారాలు ఆయన బిగ్ బాస్ షోకి దూరం కాబోతున్నారని తెలుస్తోంది. మరీ.. నాగ్ స్థానంలో ఎవరు బిగ్ బాస్ షోని డీల్ చేయబోతున్నారు ? అంటే.. శివగామి రమ్యకృష్ణ పేరు వినిపిస్తోంది. ఆమెతో పాటు నాగ్ కోడలు, స్టార్ హీరోయిన్ సమంత పేరు కూడా తెరపైకి వచ్చింది. నిజంగా మామ షోని సామ్ టేకప్ చేస్తే.. అదిరిపోవడం ఖాయం.