ధరణి – ప్రైవేటు యాప్ ? ప్రజల ఆస్తులకి రక్షణ లేదా ??

ప్రజల ఆస్తులన్నింటిని ఆన్ లైన్ చేసే ప్రయత్నం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకోసం ధరణి పోర్టల్ ని తీసుకొస్తోంది. ఇకపై భూముల రిజిస్ట్రేషన్స్ అన్నీ దరణి పోర్టల్ లోనే జరగనున్నాయి. అంతేకాదు.. వ్యవసాయేత భూములకి కూడా ప్రత్యేక పాసు పుస్తకాలని జారీ చేయనుంది ప్రభుత్వం. అయితే ధరణి ఓ ప్రయివేటు యాప్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు.

ధరణి ఓ ప్రైవేటు యాప్ అని, దాంట్లో ప్రజల ఆస్తుల వివరాలు నమోదు చేయడం ఏంటని జగ్గారెడ్ది ప్రశ్నించారు. భవిష్యత్తులో ఈ వివరాలను తాకట్టుపెట్టి భారీ మొత్తంలో రుణాలు తీసుకునే అవకాశం ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ధరణి వ్యవస్థ తెలంగాణ ప్రజలకు అవసరమా ? అని నిలదీశారు. ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ముందు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఆస్తుల వివరాలు కూడా ధరణి పోర్టల్ లో నమోదు చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.