‘లక్ష్మీబాంబ్’ ట్రైలర్.. అదిరిపోయింది !

హారర్ కామెడీ ‘కాంచన’ (ముని) సిరీస్ తమిళ్, తెలుగులోనూ సూపర్ హిట్. ఇప్పుడీ కాంచన బాలీవుడ్ కి వెళ్లింది. బాలీవుడ్ ‘కాంచన’కు ‘లక్ష్మీ బాంబ్’ టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్-కైరా అద్వానీ జంటగా నటిస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ ట్రాన్స్ జెండర్ పాత్రలో నటించనున్నారు. హారర్, కామెడీ మూవీ కాబట్టి హిందీలోనూ బాగా వర్కౌట్ అవుతుందని అంటున్నారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అక్షయ్ కుమార్ షో అదిరిపోయింది. కామెడీ, రొమాంటిక్, హారర్ సీన్స్ లో అదరగొట్టేశాడు. కాంచనలోని సీన్స్ ని యాజ్ టీజ్ గా దించేశారు. కాకపోతే.. నేపథ్య సంగీతం అదిరిరిపోయింది. నవంబర్ 9న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో #DisneyPlusHotstarలో లక్ష్మీబాంబ్ రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ చూస్తుంటే.. లక్ష్మీ బాంబ్ గట్టిగానే పేలేలా ఉంది.