ఆన్ లైన్’లో ఆస్తులని నమోదు చేసుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం ఆన్ లైన్ లో ఆస్తుల నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. వ్యవసాయేత భూములన్నీ ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలి. వాటికి ప్రత్యేక పాసు పుస్తకాలు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా సీఎం కేసీఆర్ తన ఆస్తుల వివరాలని ఆన్ లైన్ లో నమోదు చేసుకున్నారు.
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని తన నివాసంలో ఆస్తుల వివరాలను శనివారం సీఎం స్వయంగా వెల్లడించారు. గృహ వివరాలతో పాటు వ్యవసాయేతర వివరాలను ఎర్రవల్లి గ్రామ కార్యదర్శి సిద్దేశ్వర్కు తెలియజేశారు. తనకున్న ఆస్తి వివరాల పత్రాలను చూపెట్టి ఆన్లైన్లో నమోదు చేయించుకున్నారు. సాధారణ పౌరుడిగానే అంగు ఆర్భాటాలు లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్తులను వివరించారు. ఈనెల 15లోపు ప్రతిఒక్కరు తమ వివరాలను నమోదు చేసుకోవాలని సీఎం సూచించారు.