అమితాబ్’ని విష్ చేసిన చిరు

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ తన 78వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకి సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బిగ్ బీని ట్విట్టర్ వేదికగా విష్ చేశారు. బిగ్ బీ టాలెంట్‌కి పవర్‌హౌస్, తన మార్గనిర్ధేషికులని సంబోధించారు.

‘నా ప్రియమైన పెద్దన్నయ్య.. భారతీయ చిత్రపరిశ్రమకు బిగ్‌ బి.. టాలెంట్‌కి పవర్‌హౌస్.. అలాగే ఎప్పటికీ నా మార్గదర్శకులు అమిత్‌ జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ నటన, తేజస్సుతో ప్రేక్షకులను అలరించాలని, మరెన్నో సంవత్సరాలపాటు మాలో స్ఫూర్తి నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’నని చిరు ట్విట్ చేశారు.