ఈషా రెబ్బా కొత్త ఫోటోలు.. వైరల్ !

తెలుగమ్మాయి ఈషా రెబ్బా సినిమాలు ఉన్నా.. లేకున్నా వరుస ఫోటో షూట్స్ తో సందడి చేస్తోంది. ఆమె నుంచి వరుసగా ఫోటో షూట్స్ ఫోటోలు క్యూ కడతాయి అన్న విషయం తెలిసిందే. తాజాగా కొత్త ఫోటోని షేర్ చేసింది. అది అదిరిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పటికే ఈషా రెబ్బా మంచి నటి అనిపించుకుంది. కానీ బిజీ హీరోయిన్ కాలేకపోయింది. ఇందుకోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. హాట్ గా కనిపించేందుకు రెడీ, గ్లామర్ పాత్రల్లోనూ నటిస్తానని ఓపెన్ ఆఫర్ ఇస్తోంది. మరీ.. ఆమె ఆఫర్ ని ఎవరు వాడుకుంటారో చూడాలి. ఓ వైపు ఫోటో షూట్స్ చేస్తూనే.. మరోవైపు తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతోంది ఈషా.

ఇందులో ఆమె బాక్సర్ గా కనిపించనుంది. ఇందుకోసం బాక్సింగ్ లో శిక్షణ తీసుకుంటున్నారు. కరోనా లాక్‌డౌన్ టైమ్ లో బాక్సింగ్ ప్రాక్టీస్ చేసింది. దీంతో పాటు జిమ్నాస్టిక్ట్స్ నేర్చుకొంది. ఫిట్నెస్ పై పోకస్ పెట్టింది. అయితే ఈషా రెబ్బా బాక్సర్ గా కనిపించబోయేది ఓటీటీ మూవీనా ? అన్నది తెలియాల్సి ఉంది.