బిగ్ బాస్ : ఈ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్.. ఎందుకంటే ?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా ఐదో వారాన్ని పూర్తి చేసుకోబోతోంది. ఈ వారం ఎలిమినేషన్ లిస్టులో సుజాత, రాజశేఖర్, లాస్య, అభిజిత్, అమ్మ రాజశేఖర్, అఖిల్, అరియానా, సోహైల్‌, నోయల్ ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కావాల్సి ఉంది. అయితే ఇప్పటికే సోహైల్, అఖిల్ సేవ్ అయ్యారు.

ఇక మిగిలిన సుజాత, రాజశేఖర్, లాస్య, అభిజిత్, అమ్మ రాజశేఖర్, అరియానా, నోయల్ లలో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. వీరిలో అమ్మరాజశేఖర్, సుజాతకు తక్కువ ఓట్లు వచ్చాయి. వీరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సుజాత ఎలిమినేట్ అయిందనే లీకులు కూడా వచ్చాయి. అయితే సుజాతని గంగవ్వ కాపాడినట్టు తెలుస్తోంది. అనారోగ్యం బాగలేక గంగవ్వ శనివారం బయటికొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వారం గంగవ్వని బయటికి పంపించిన నేపథ్యంలో ఎలిమినేషన్ ని క్యాన్సిల్ చేయలనే ఆలోచనలో బిగ్ బాస్ ఉన్నట్టు సమాచారమ్. ఇదే నిజమైతే.. ఈ వారం ఎలిమినేషన్ ఉండదు.

ఇక సోహైల్ కి డబుల్ దమాఖా లభించింది. ఈ వారం ఎలిమినేషన్ లిస్టులో ఉన్న వారిలో మొదట సోహైల్ నే సేవ్ అయ్యారు. ఇక ఈ వారం కెప్టెన్ గా సోహైల్ ఎంపిక కావడంతో.. వచ్చే వారం ఆయన ఎలిమినేషన్ నుంచి తప్పించుకోనున్నారు. దీంతో రెండు వారాల పాటు సోహైల్ కి ఎలిమినేషన్ నుంచి తప్పించుకోనున్నారు.