కోల్ కతాకు షాక్.. నరైన్ బౌలింగ్‌పై ఫిర్యాదు !
ఐపీఎల్’లో కోల్ కతాకు బౌలర్ సునీల్ నరైన్ కీలకంగా మారాడు. గత మ్యాచ్ లో పంజాయ్ తో గెలవడానికి నరేష్ నే కారణమని చెప్పవచ్చు. ఆఖరి మూడు ఓవర్లలో నరేష్ రెండు ఓవర్లు వేశారు. అతడు వేసిన 18వ ఓవర్ లో రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక ఆఖరి ఓవర్ లో జట్టుని విజయతీరాలకు చేర్చాడు. అయితేఆ మ్యాచ్‌లో నరైన్ బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఆన్‌ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గఫెనీ, ఉల్హాస్ బీసీసీఐకి ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘నరైన్‌ను హెచ్చరిక జాబితాలో ఉంచుతున్నాం. ప్రస్తుతం అతను బౌలింగ్ వేయవచ్చు. మరోసారి ఫిర్యాదు వస్తే మాత్రం బీసీసీఐ నుంచి క్లియరెన్స్ వచ్చే వరకు నరైన్ బౌలింగ్ వేసే అవకాశం ఉండదు’ అని ప్రకటనలో పేర్కొంది. గతంలోనూ పలుమార్లు నరైన్ తన బౌలింగ్ శైలి కారణంగా నిషేధం ఎదుర్కొన్నాడు. 2015 వరల్డ్‌కప్ టోర్నీకి కూడా దూరమయ్యాడు. 2016లో ఐసీసీ అతని బౌలింగ్‌కు క్లియరెన్స్ ఇచ్చింది.