థియేటర్స్ తెరవలేం !

అన్ లాక్ 5లో భాగంగా ఈ నెల 15 నుంచి థియేటర్స్ ఓపెనింగ్ కి కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. 50 శాతం ఆక్యుపెన్సీతో కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్స్ తెరచుకోవచ్చని కేంద్రం చెప్పింది. మొత్తం 24 నిబంధనలని సూచించింది. అయితే అనుమతులు లభించినా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ తెరచుకునే పరిస్థితులు కనిపించడం లేదు.

దూరం(ఎడం) పాటిస్తూ సీటింగ్‌ సామర్థ్యంలో 50శాతానికి మించకుండా అక్టోబరు 15 నుంచి కార్యకలాపాలను ప్రారంభించడానికి కేంద్రం అనుమతులు ఇచ్చింది. అయితే కేంద్రం చెప్పిన 24 నిబంధనలను పాటిస్తూ.. షోకు షోకు మధ్య శానిటైజ్‌ చేయాలంటే దానికి కొంత ఖర్చుతో పాటు థర్మత్‌స్కానర్లును కూడా కొనాలి. వీటన్నిటికి సుమారు 10 లక్షల ఖర్చు చేయాలని యాజమాన్యాలు చెబుతున్నాయి. పైగా కరోనా టైమ్ లో బకాయి పడిన కరెంట్ బిల్లులు లక్షల్లో ఉన్నాయి. ఇన్ని ఇబ్బందుల్లో థియేటర్స్ తెరచినా.. ప్రేక్షకులు వస్తారనే గ్యారెంటీ లేదు. ఈ నేపథ్యంలో థియేటర్స్ తెరవడంపై థియేటర్స్ యాజమానులు మీమాంసలో ఉన్నారు.