దేశంలో జీరో కరోనా కేసులు.. ఎప్పటి వరకు అంటే ?

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది. మరణాల జాబితాలో మూడో స్థానంలో ఉంది. మరికొద్దిరోజుల్లో ఈ రెండు విభాగాల్లోనూ భారత్ టాప్ లోకి చేరుకోనుంది అనుకున్నారు. కానీ కరోనా నుంచి భారత్ కోలుకుంటోంది. ఎంతలా అంటే.. ? మరో మూడ్నెళ్లల్లో దేశంలో జీరో కరోనా కేసులు ఉండేలా. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ.. రికవరీ అవుతున్న వారి సంఖ్య పెరుగుతూ పోతుంది.

గడిచిన 24 గంటల్లో దేశంలో 55,342 కొత్త కేసులు నమోదు కాగా మరో 77,760 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 86.78శాతానికి పెరిగింది. యాక్టివ్‌ కేసులు సంఖ్య 8,38,729కి పడిపోయాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 11.69శాతానికి తగ్గాయి. క్రియాశీల కేసులు తగ్గిపోవడాన్ని బట్టి చూస్తుంటే మూడు నెలల్లో మొత్తం యాక్టివ్‌ కేసులు కనుమరుగయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.  ఇక గత 24 గంటల్లో మరో 706 మంది కరోనాకు బలయ్యారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,09,856కి పెరిగాయి.