తీరం దాటిన తీవ్రవాయుగుండం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు !

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, నర్సాపూర్‌ల మధ్య కాకినాడకు ఎగువున తీరాన్ని దాటింది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొచ్చి కాకినాడ సమీపంలో భూ భాగాన్ని తాకినట్టు అధికారులు తెలిపారు. తీరం వెంబడి 65 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.

దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం నుంచి ప్రకాశం జిల్లా వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో కోస్తా, తెంగాణ, మహారాష్ట్రలోని విదర్భ, మరఠ్వాడా ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.