భారీ వర్షాలు.. రెండ్రోజులు సెలవులు !

గత రెండ్రోజులుగా తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. రికార్డ్ స్థాయిలో 35 సె.మీ వర్షపాతం పడినట్టు అంచనా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ, రేపు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అవరం ఉంటే తప్పా జనాలు బయటికి రావొద్దని విజ్ఝప్తి చేశారు. పిల్ల‌లు, వృద్ధులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించింది. పాత భ‌వ‌నాల‌ను త‌క్ష‌ణ‌మే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాల‌కు వెళ్లాల‌ని తెలిపింది. రాష్ర్ట వ్యాప్తంగా క‌లెక్ట‌ర్ల‌ను, పోలీసు శాఖ‌ను ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం చేసింది.

మరోవైపు అధికారులని అప్రమత్తం చేశారు. మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అన్నివిధాలా సన్నద్ధంచేసి తక్షణం సహాయచర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అప్పటికప్పుడే అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్షాల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ముంపు, లోతట్టు ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. కరోనా విజృంభిస్తున సమయంలో వచ్చిన వచ్చిన భారీ వర్షాలు.. ప్రజల జీవనాన్ని మరింత అస్తవ్యస్థం, అద్వానం చేశాయి.