హైదరాబాద్’లో భారీ వర్షం.. వందేళ్ల రికార్డ్ !
భారీ వర్షాలతో హైదరాబాద్ నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలు మాత్రమే కాదు. కాస్త గురువు గడ్డపై ఉన్న ప్రాంతాలు కూడా నీటి మునిగాయి. హైదరాబాద్ లో రికార్డ్ స్థాయిలో 35 సె.మీ వర్షపాతం పడింది. ఈ స్థాయిలో భారీ వర్షాలుపడటం గత వందేళ్లలో ఇది రెండోసారి అని చెబుతున్నారు. సాధారణంగా 4సె.మీ వర్షపాతం పడితేనే హైదరాబాద్ డ్రైనేజీ తట్టుకుంటోంది. ఆ స్థాయి వర్షానికే లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. అలాంటిది ఏకంగా 35 సె. మీ వర్షపాతం అంటే.. పరిస్థితి ఏ రేంజ్ లో ఉన్నది అన్నది అర్థం చేసుకోవచ్చు.
ఒక్క హైదరాబాద్ లో మాత్రమే తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి. హై వే రహదారులన్నీ కొట్టుకుపోతున్నాయి. చెరువు, కుంటలు నిండి ఉప్పొంగడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ దెబ్బకు రహదారులకు గండ్లు పడుతున్నాయి. గ్రామాలల్లోనూ పలు రహదారులు కొట్టుకుపోయాయ్. దీంతో.. ఒక ఊరి నుంచి మరో ఊరికి కనెక్టివిటీ కట్ అయింది. ఈ భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఆస్థి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ లో ఇప్పటికే పలు చోట మూడ్నాలుగు మృతదేహాలు కొట్టుకొచ్చాయ్. మొత్తానికి.. భారీ వర్షాలు ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేశాయని చెప్పవచ్చు.