అలర్ట్ : హైదరాబాద్’లో ఈ రహదారులు మూసివేత
భారీ వర్షాలు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తాయ్. రికార్డ్ స్థాయిలో 35 సె. మీ వర్షపాతం పడటంతో నగరం నీట మునిగింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నగర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. అధికార యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. మరోవైపు వరద ప్రభావం, ఇతర సమస్యల కారణాల వలన పలు రహదారులని మూసివేశారు.
* ఉప్పల్ – ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్ – కోఠి రోడ్లు మూసివేత
* బేగంపేటలో రహదారిపై భారీగా వరద నీరు
* కాచిగూడ రైల్వేష్టేషన్‌లో పట్టాలపై నిలిచిన వర్షపు నీరు
* నిజాంపేటతో పాటు బండారి లేఅవుట్ జలమయం
* మెహిదీపట్నం – హైటెక్ సిటీ రహదారి జలమయం
* కూకట్‌పల్లి ఐడీపీఎల్, హాఫిజ్‌పేట చెరువులకు భారీ వరద
* హుస్సేన్ సాగర్ 4 గేట్లు ఓపెన్
* గచ్చిబౌలి నుంచి హెచ్‌సీయూ వెళ్లే దారిలో భారీగా వర్షపు నీరు
* బెంగళూరు – హైదరాబాద్, విజయవాడ హైవేలు మూసివేశారు.