మరో రెండ్రోజులు అప్రమత్తంగా ఉండండి : కేటీఆర్

భారీ వర్షాలని భాగ్యనగరం అతలాకుతలం అయింది. రహదారులు చెరువులని తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు మాత్రమే గరువు ప్రాంతాలు కూడా నీట మునిగాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ ఎంసీ అధికారులు సహాయక చర్యలని ముమ్మరం చేశారు. మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లోని పలు కాలనీల్లో పర్యటించారు. ప్రజల బాధలని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ముసారాంబాగ్‌లోని సలీంనగర్‌లో పర్యటించిన మంత్రి కేటీఆర్ బాధితులతో మాట్లాడారు. రాబోయే రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలి. వానలు తగ్గే సూచన లేదు. ఇప్పుడు ఎక్కడైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారు.. మరో రెండు రోజుల పాటు కూడా అక్కడే ఉండాలని సూచించారు.ఇక్కడే బోజన సదుపాయాలు కల్పిస్తారు. వైద్యులు కూడా అందుబాటులో ఉంటారు. మందులు ఇస్తారని తెలిపారు. వీటితో పాటు ప్రభుత్వం నుంచి సాయం కూడా అందిస్తారు. నష్టపరిహారం చెల్లిస్తారని తెలిపారు.