‘లవ్ స్టోరీ’ ఎక్కడి వరకు వచ్చింది ?

నాగ చైతన్య-సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ని శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని శేఖర్ కమ్ముల తాపీగా చెక్కుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి లవ్ స్టోరీ ఓ సాంగ్, కొంత షూట్ మాత్రమే బకాయి ఉంది. ఒక నెలలోపే పూర్తి అవుతుందని సమాచారమ్. అన్నీ బాగుండి దీపావళికి జనాలు థియేటర్లకు వస్తే లవ్ స్టోరీ క్రిస్మస్ కు వస్తుంది. లేదా అంతే వచ్చే యేడాది సంక్రాంతికి రావొచ్చు. అదీ కూడా సంక్రాంతి రేసులో వకీల్ సాబ్ లేకుంటేనే.

క్రిస్మస్, సంక్రాంతికి కూడా కుదరకపోతే లవర్స్ డే ఫిబ్రవరి 14కి లవ్ స్టోరీ రావొచ్చు. ప్రస్తుతానికి ఈ సినిమా రిలీజ్ డేటు విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు.  ముందు సినిమా ఫినిష్ అయితే, మార్కెట్ పరిస్థితి చూసి విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఫిదా సినిమా తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న చిత్రమిది. శేఖర్ కమ్ముల సినిమాని నెమ్మదిగా చెక్కినా ప్రేక్షకులని ఫిదా చేసేలా చెక్కుతారు. అందుకే ఆయన్ని ప్రేక్షకులకి తొందరపెట్టరు.