మత్తెక్కించే భామకు పొలిటికల్ రిఫరెన్స్ 

పొలిటికల్ టచ్ తో సినీ పరిశ్రమ నడుస్తుంటుందని చెబుతుంటారు. కొన్ని నిర్మాణ సంస్థలు రాజకీయ నేతల భినామీలు అని కూడా చెప్పుకుంటుంటారు. అయితే హీరోయిన్స్ కు పొలిటికల్ రిఫెరెన్స్ అనేది చాలా తక్కువ. ఒకవేళ ఉన్నా.. అవి బయటికి రావు. కానీ ఓ రాజకీయ  నేత ఓ హీరోయిన్ ని రిఫర్ చేసిన విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోనికి వచ్చిందట.

కొన్నాళ్ల క్రితం ఓ మెగా హీరో సినిమా వచ్చింది. మాంచి ఫీల్ గుడ్ లవ్ సబ్జెక్ట్ తో తీసిన ఆ సినిమాకు ఫలానా హీరోయిన్ ను పెట్టుకోండి అంటూ నిర్మాత మీద తెగ వత్తిడి తెచ్చారట ఓ పెద్దాయన. మాంచి ఫిజిక్ తో, మత్తెక్కించే కళ్లతో, కవ్వించే విధంగా చిట్టి పొట్టి నిక్కర్లతో తన తొలి సినిమాలో నటించిన ఈ నటి తెలుగులో అడపాదడపా నటిస్తూ వుంటుంది. ఆమెకి మెగా ఆఫర్ ఇప్పించేందుకు గట్టిగా ప్రయత్నించారని తెలుస్తొంది. ఈ నేపథ్యంలోనే.. సదరు నేతతో ఆ బ్యూటీకి లింకులు కూడా పెడుతున్నారు.