‘సర్కారు వారి పాట’ ప్లాన్-బి ఏంటంటే ? 

పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా తొలి షెడ్యూల్ ని అమెరికాలో ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు అక్కడి వెళ్లే పరిస్థితి లేదు. అందుకు మహేష్ రెడీగా లేరు. ఈ నేపథ్యంలో సరిలేరు చిత్రబృందం ప్లాన్-బి రెడీ చేసినట్టు తెలుస్తోంది. అదేంటీ ? అంటే.. మహేష్ ఓకే అంటే.. అమెరికా షెడ్యూల్ కంటే ముందు ఇండియాలోని షెడ్యూల్ ని పూర్తి చేస్తారట.

ఒకవేళ మహేష్ నో చెప్పినా.. ఆయన పాత్రని మినహాయించి మిగితా వారి పాత్రలపై షూటింగ్ ని ప్లాన్ చేయనున్నారట. అయితే ప్లాన్ బి గురించి ఇంకా మహేష్ దగ్గరకు వెళ్లలేదట. మరోవైపు సర్కరు వారి పాటని పక్కనపెట్టేసి మహేష్ త్రివిక్రమ్ సినిమాని లైన్ లో పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అలా జరగకూడదనే సర్కారు వారి పాట ప్లాన్ బి రెడీ చేసినట్టు తెలుస్తోంది. మరీ.. ప్లాన్ బికి మహేష్ ఓకే చెబుతాడా ? అన్నది చూడాలి.