వైరల్ : #ShameonyouVijaySethupathi

శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ సినిమాగా రాబోతోంది. ‘800’ పేరుతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ముత్త‌య్య పాత్ర‌ని విజ‌య్‌సేతుప‌తి పోషిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన లుక్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. అందులో ముత్త‌య్య‌గా విజ‌య్ లుక్ చూసి, ఫ్యాన్సంతా షాక్ కి గుర‌య్యారు. ముత్త‌య్య లుక్ నూటికి నూరుపాళ్లూ..దించేశాడు విజ‌య్‌. అయితే విజయ్ ముత్తయ్యగా మారడాన్ని తమిళ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీ‌లంక‌లో చాలామంది త‌మిళులు అణ‌చివేత‌కు గుర‌వుతున్నారు. శ్రీ‌లంక‌లో జాతి వివ‌క్ష‌త మ‌రింత ఎక్కువ‌. త‌మిళుల ప‌ట్ల నిర్దాక్ష‌ణ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అలాంటి దేశానికి సంబంధించిన వ్య‌క్తిపై బ‌యోపిక్ తీయ‌డం, అందులో ఓ త‌మిళ హీరో న‌టించ‌డం వాళ్ల‌కు న‌చ్చ‌డం లేదు. ఈ నేపథ్యంలో  ‘షేమ్‌ఆన్ యు‌ విజయ్‌సేతుపతి` అంటూ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ ప్రారంభించారు.ఇప్పుడీ యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. మరీ తమిళ ప్రజల ఆగ్రహాన్ని అర్థం చేసుకొని విజయ్ ఈ సినిమా నుంచి తప్పుకుంటారా ? లేదా సినిమాని సినిమాలా చూడాలని సర్థజెప్పి ముందుకు సాగుతారా ?? అన్నది చూడాలి.