గంగవ్వతో బిత్తిరి సత్తి.. గరం గరం ముచట్లు ! 

ఇద్దరు తెలంగాణ ముద్దు బిడ్డలు కలిశారు. గంగవ్వ-బిత్తిరి సత్తి కలిసి దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో పాల్గొన్న గంగవ్వ అనారోగ్యంతో బయటికొచ్చిన సంగతి తెలిసిందే. వారం రోజుల చికిత్స తర్వాత సొంతూరికి వెళ్లారు. గంగవ్వ ప్రస్తుతం మల్యాల మండలంలోని లంబాడిపల్లి గ్రామంలోని తన ఇంట్లో క్షేమంగా ఉంది.

తాజాగా బిత్తిరి సత్తి గంగవ్వ ఇంటికి వెళ్లాడు.ఆమె యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు.. గంగవ్వతో బిత్తిరి సత్తి గరం గరం ముచ్చట్లు పెట్టినట్టు తెలిసింది. సాక్షి టీవీలో వచ్చే గరం గరం ముచ్చట్లలో వాటిని చూడబోతున్నామని చెబుతున్నారు.