అనసూయపై ఆది జబర్థస్త్ పంచ్’లు

కామెడీ షో ‘జబర్దస్త్‌’  స్టేజ్ పై ఒకప్పుడు రష్మి-సుడిగాలి సుధీర్ లు ఒకరిపై మరొకరు వేసుకునే పంచ్ లు ఆకట్టుకునేవి. ఆ తర్వాత అనసూయ-ఆదిల ఏపీసోడ్ హైలైట్ అవుతోంది. అయితే త్వరలో ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో భాగంగా హైపర్‌ ఆది.. ‘ప్రేమనగర్‌’ చిత్రంలోని ‘ఎవరికోసం ఎవరికోసం’ అనే సాంగ్‌తో ఎంట్రీ ఇస్తారు. తనని ఉద్దేశిస్తూ ఆది చేసిన పెర్ఫామెన్స్‌ చూసి అనసూయ సరదాగా నవ్వుకుంటారు.

‘ఏయ్‌.. నీకు పిచ్చా’ అంటూ నవ్వులు పూయిస్తారు. అనంతరం స్కిట్‌లో భాగంగా అనసూయపై ఆది వేసిన వరుస పంచులు బాగా పేలాయ్. వచ్చే గురువారం (అక్టోబర్‌ 22) ప్రసారం కానున్న ‘జబర్దస్త్‌’ కామెడీ షోకి సంబంధించిన ప్రోమో చూసేయండి.