కోల్‌కతా కెప్టెన్’గా మోర్గాన్
ఊహించినదే జరిగింది. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ మారాడు. దినేష్ కార్తీక్ స్థానంలో ఇయాన్ మోర్గాన్ కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. దినేష్ కార్తీక్ స్వతహా కెప్టెన్ బాధ్యతలని వదులుకున్నారు. ఇటీవల అతడు పెద్దగా రాణించకపోవడంతో ఒత్తిడికి గురై విఫలమవుతున్నాడు. ఆ ప్రభావం తన ఆటపై పడుతున్నందున జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు యాజమాన్యానికి తెలిపాడు. దీంతో కోల్‌కతా తమ కొత్త సారథిగా ఇయాన్ మోర్గాన్‌ను నియమిస్తున్నట్లు టీమ్ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా ఐపీఎల్ లో ఏడు మ్యాచ్ లకి దినేష్ కార్తీక్ కెప్టెన్ గా వ్యవహరించారు. అయితే కెప్టెన్ గా, ఆటగాడిగా దినేష్ విఫలవుతున్నాడు. ఈ నేపథ్యంలో దినేష్ స్థానంలో మోర్గాన్ కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఝప్తులు వస్తున్నాయి. మాజీలు, క్రికెట్ విశ్లేషకులు కూడా దినేష్ కెప్టెన్ గా విఫలమవుతున్నాడు. ఇంగ్లండ్ కు టీ20 వరల్డ్ కప్ అందించిన మోర్గాన్ కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని అభిప్రాయపడ్డారు.
📰 “DK and Eoin have worked brilliantly together during this tournament and although Eoin takes over as captain, this is effectively a role swap,” says CEO and MD @VenkyMysore #IPL2020 #KKR https://t.co/6dwX45FNg5
— KolkataKnightRiders (@KKRiders) October 16, 2020